కేబినెట్లోకి థాకరే వారసుడు, డిప్యూటీగా అజిత్

0
3
Aditya Thackeray
Ajit Pawar, Aditya Thackeray to make it to Cabinet

మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం సోమవారం కొలువుదీరింది. కేబినెట్లోకి ఎన్సీబీ కీలక నేత అజిత్ పవార్‌తో పాటు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరేలకు చోటు దక్కింది. థాకరే కుటుంబం నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిత్యకు చోటు దక్కడం గమనార్హం. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 35 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నుంచి 10 మంది కేబినెట్ మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 8 మంది కేబినెట్ మంత్రులు, ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నారు. శివసేన నుంచి 6గురు మంత్రులు, ముగ్గురు సహాయమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కేఎస్పీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కేబినెట్ మంత్రిగా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేను సహాయమంత్రిగా తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here