ప్రతీకారం తీర్చుకుంటాం: అమెరికాకు ఇరాన్ వార్నింగ్

0
7

తమ దేశ ఖడ్స్ ఫోర్స్ అదినేత ఖాసీం సోలెమన్‌ను రాకెట్ లాంచర్‌తో హతమార్చిన అమెరికాపై ఇరాన్ మండిపడింది. తమ నుంచి ప్రతీకార దాడి తప్పదని సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమనెయ్ హెచ్చరించారు. అమెరికా జరిపిన ఈ దాడి భయంకరమైన, ఉద్రిక్తతలను పెంచే అవివేకపు చర్య అని ఇరాన్ మంత్రి జావద్ అన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాలన్నారు. ఈ దాడి అంతర్జాతీయ ఉగ్రవాదంగా పేర్కొన్నారు.

మరోవైపు, ఖాసీం మృతి నేపథ్యంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌లోని తమ పౌరులకు అమెరికా అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాక్ వదిలి వెళ్లిపోవాలని బాగ్దాత్‌లోని అమెరికా ఎంబసీ సూచించింది. వాయు మార్గం లేదా రోడ్డు మార్గం లేదా రైలు మార్కం ద్వారా వెళ్లిపోవాలని కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here