రాజధాని ఇష్యూ: జగన్ చేతికి బోస్టన్ నివేదిక

0
2

రాజధాని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) ఏపీ ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక ఇచ్చింది. రాజధాని, రాష్ట్ర అభివృద్ధి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇదివరకు మధ్యంతర నివేదికను అందించింది. తాజా నివేదికలో అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాలను పొందుపరిచింది.

ప్రాంతాలవారీగా ఎంచుకోవాల్సిన అంశాలు, వ్యవసాయ, పర్యాటక, పరిశ్రమ, మత్స్య రంగాల గురించి వివరించింది. రాష్ట్రాన్ని 6 ప్రాంతాలుగా విభజించి అధ్యయనం చేసింది బోస్టన్ కమిటీ సూచించింది. బెంగళూరుకు ధీటుగా అనంతపురంను, హైదరాబాద్‌కు దీటుగా కర్నూలును అభివృద్ధి చేయాలని సూచించింది. కాగా, రాజధానిపై ఇప్పటికే జీఎన్ రావు కమిటి నివేదిక ఇచ్చింది. ఈ రెండు కమిటీల నివేదికను హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది.

కాగా, అంతకుముందు ఏలూరులో జగన్ రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి నిర్ణయానికి ప్రాతిపదిక, అందరూ బాగుండాలన్నారు. అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలన్నారు. గ్రామం నుంచి రాష్ట్రం వరకు సమానమని, గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here