రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై హైపవర్ కమిటీ

0
4
andhra pradesh capital
AP government will be constituting a high-power committee to study the GN Rao Committee Report and the BCG Report.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ సహా కీలకమైన ప్రాజెక్టులపై నిపుణల కమిటీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసేందుకు దీనిని నియమించింది. ఈ నివేదికలను అధ్యయనం చేసి అభవృద్ధి వికేంద్రీకరణ, రాజధానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ కమిటీలో సభ్యులుగా బుగ్గన రాజేంద్రనాథ్, సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, కన్నబాబు, సుచరిత, మోపిదేవి, కొడాలి నాని, పేర్ని నాని, ముఖ్యమంత్రి సలహాదారు, డీజీపీ, సీసీఎల్ఏ, పురపాలక శాఖ కార్యదర్శులు ఉంటారు.

ఏపీ రాజధాని అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు అని సీఎం జగన్ సభలో చెప్పారు. కర్నూలు, అమరావతి, విశాఖపట్నం ఉంటుందన్నారు. అయితే ఆ తర్వాత రాజధానులు కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు. ఇందులో భాగంగా విశాఖ నుంచి పరిపాలన ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిపై టీడీపీ విమర్శలు గుప్పిస్తుండగా, వైసీపీ సమర్థించుకుంటోంది.

తాజాగా, ఆదివారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ.. గతంలో జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించారని, రాజధానిని కదిలిస్తే ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్తుందని, దీనిని కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. అమరావతిని గతంలో ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించలేదన్నారు. అయితే సుజన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. సుజన బ్లాక్ మెయిలింగ్‌కు ఎవరూ భయపడరన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here