రాజధాని, ఏపీ అభివృద్ధిపై బోస్టన్ కమిటీ ఏం చెప్పిందంటే?

0
3

బీసీజీ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి అధ్యయనం చేసింది. ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం), గోదావరి డెల్డా (తూర్పు, పశ్చిమ గోదావరి), కృష్ణా డెల్టా (కృష్ణా, గుంటూరు), దక్షిణాంధ్ర (నెల్లూరు, ప్రకాశం), తూర్పు రాయలసీమ (చిత్తూరు, కడప, వెస్ట్ రాయలసీమ (కర్నూలు, అనంతపురం)లుగా విభజించింది.

విశాఖపట్నం మినహా మిగతాచోట్ల అంతర్జాతీయ విమాన ప్రయాణీకులు లేరని, పోర్టులు కూడా అక్కడి కంటే ఎక్కడా అభివృద్ధి చెందలేదని పేర్కొంది. విదేశీ పర్యాటకుల వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొంది.

ఉత్తరాంధ్రను మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేయవచ్చునని, కాఫీ పసుపు, జీడిపప్పు పరిశ్రమలకు ఆ ప్రాంతం అనుకూలమని తెలిపింది. గోదావరి డెల్టాలో ప్లాస్టిక్, గ్యాస్ రంగాల్లో పరిశ్రమలు, బ్యాక్ వాటర్ టూరిజంతో పాటు పోలవరం, వాటర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్ లాంటివి అభివృద్ధి చేయవచ్చునని పేర్కొంది. కృష్ణా జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా చేసి, మచిలీపట్నం, మైపాడు బీచ్‌లను అభివృద్ధి చేయాలని సూచించింది.

చిత్తూరు జిల్లాలో టమాటా పంటకు కోల్డ్ స్టోరేజీలు, తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ప్రోత్సహించాలని, కర్నూలు, అనంతపురంలో ఆటోమొబైల్ లాజిస్టిక్ హబ్‌ను డెవలప్ చేయాలని సూచించింది.

అమరావతిని ఒక్క దానినే రాజధానిగా అభివృద్ధి చేస్తే రూ.1.10 లక్షల కోట్లు అవసరమని, అంత డబ్బు పెట్టడం అవసరమా అని పేర్కొంది. అమరావతి కోసం రుణం తెస్తే ఏడాదికి రూ.10వేల కోట్ల వడ్డీ కట్టాలని, నలభై ఏళ్ల తర్వాత వచ్చే రాబడి కోసం ఇప్పుడు అంత పెట్టుబడి అవసరం లేదని పేర్కొంది. ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల అప్పు ఏపీకి ఉందని, మరో రూ.1 లక్ష కోట్లు పెట్టగలదా అని బోస్టన్ నివేదిక ప్రశ్నించింది. విశాఖ నగరంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here