వికేంద్రీకరణతోనే అభివృద్ధి: బుగ్గన

0
11

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం బుగ్గన సభలో మాట్లాడారు.

అది వికేంద్రీకరణ తోనే సాధ్యం..

‘ఈ బిల్లు చారిత్రాత్మక మైనది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా లోకల్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నాం. 4 జిల్లాలకు కలిపి ఒక జోనల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఉంటుంది. అమరావతి మెట్రో పాలిటన్‌ రీజియన్‌ ను ఏర్పాటు చేస్తున్నాం. కార్య నిర్వాహక రాజధానిగా విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌, లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా ఉంటాయి. అభివృద్ధి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు రావాలని ప్రజలు కోరుతున్నారు. ఇది వికేంద్రీకరణ తోనే సాధ్యపడుతుంది. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. శ్రీ కృష్ణ కమిటీ కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నట్లు చెప్పింది.’ అని బుగ్గన అన్నారు.

13 జిల్లాల్లో సమానమైన అభివృద్ధి..

‘శివరామ కృష్ణన్‌ కమిటీ రాష్ట్రంలో 13 జిల్లాల్లో సమానమైన అభివృద్ధి జరగాలని సూచించింది. ప్రత్యేక వాదం రాకుండా ఉండాలంటే సమానమైన అభివృద్ధి జరగాలని పేర్కొంది. రాష్ట్రంలో ఎక్కడా పెద్ద నగరం నిర్మించ వద్దని కూడా సూచించింది. దానికి బదులు పరిపాలన వికేంద్రీకరణ మేలని కమిటీ పేర్కొంది. మరో సారి తెలంగాణ లాంటి అంశం తెర పైకి రాకుండా ఉండాలంటే.. రాష్ట్రంలో వికేంద్రీకరణ చాలా అవసరమని శివరామ కృష్ణన్‌ కమిటీ స్పష్టం చేసింది’ అని బుగ్గన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here