ఇండియాలో డీజిల్ కార్లకు కాలం చెల్లినట్లేనా?

0
5
diesel cars

ఇండియా లో గత ఇరవై ఏళ్లుగా డీజిల్ కార్లదే హవా. పాసెంజర్ కార్ల నుంచి స్పోర్ట్స్ యుటిలిటీ వరకు దాదాపు అన్ని రకాల కార్లు డీజిల్ వే అధికంగా అమ్ముడయ్యేవి. కానీ ప్రస్తుతం వినియోగదారుల్లో చాలా మార్పు వచ్చింది. డీజిల్ తో పోల్చితే పెట్రోల్ కార్లకే ఎక్కువగా జై కొడుతున్నారు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యూ వీ ) అమ్మకాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు ఆటోమొబైల్ రంగ నిపుణులు కొన్ని కారణాలను చెబుతున్నారు. గతంలో పెట్రోల్ కు, డీజిల్ కు మధ్య ధరల వ్యత్యాసం అధికంగా ఉండేది. లీటర్ కు కనీసం రూ 20 నుంచి రూ 25 వరకు పెట్రోల్ అధికంగా ఉండేది. కానీ ప్రస్తుతం అది కాస్త రూ 10 స్థాయికి పడిపోయింది. మరో వైపు డీజిల్ కార్ల ధరలు మోడల్ ను బట్టి కనీసం రూ 1 లక్ష నుంచి రూ 2 లక్షల వరకు అధికంగా ఉంటున్నాయి. దీంతో వినియోగదారుకు అధిక ఆర్థిక భారం పడుతోంది. లోన్ ద్వారా కార్ కొనాలనుకునే వారికి ఈఎమ్ఐ భారం పెరుగుతోంది. మరో వైపు దేశంలో బీఎస్ – 6 నిబంధనలు అమల్లోకి రావటంతో డీజిల్ కార్ల ధరలు మరింత పెరుగుతున్నాయి.

అటువైపు చూస్తున్నారు… 

దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ను కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రభుత్వం అనేక వెసులుబాట్లు కల్పిస్తోంది. పన్ను కూడా తగ్గించింది. దీంతో వినియోగదారులు అయితే ఎలక్ట్రిక్ వాహనాలు, లేదా పెట్రోల్ వాహనాలకు జై అంటున్నారు. దీంతో దేశంలో అమ్ముడయ్యే పెట్రోల్ ఎస్ యూ వీ కార్ల వాటా గతంలో కేవలం 20% ఉండగా ప్రస్తుతం అది సుమారు 40% నికి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here