న్యూసౌత్ వేల్స్‌లో కార్చిచ్చు, బీచ్‌లలోకి వేలాదిమంది పరుగు

0
7

ఆస్ట్రేలియాలోని ఆగ్నేయ ప్రాంతంలో కార్చిచ్చు రాజుకుంది. లక్షల ఎకరాల్లో అడవులు, గడ్డినేలలను స్వాహా చేస్తూ పర్యాటకులు ఎక్కువగా సందర్శించే తీర ప్రాంతాలను కార్చిచ్చు ముంచెత్తింది. దీంతో అనేక పట్టణాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులెత్తారు. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన వేలాది మంది పర్యాటకులు, స్థానికులు తప్పించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

అగ్నికీలలు రోడ్డు మార్గాన్ని మూసివేశాయి. దీంతో వారు బీచ్ వద్దకు పరుగులు తీశారు. దీంతో వేలాది మంది తీరంలో చిక్కుకుపోయారు. కార్చిచ్చు నేపథ్యంలో చాలామంది పడవల్లో వెళ్లారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లాలని విక్టోరియా అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. తీర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైన్యం సేవలు తీసుకున్నారు. మొత్తం 200 కిలో మీటర్ల పొడవున ఉన్న సముద్ర తీర పట్టణాల్లో కార్చిచ్చు అంటుకుంది. ఇదిలా ఉండగా, కార్చిచ్చు కారరణంగా ఏడుగురు చనిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here