ధోనీ భవిష్యత్తుపై బీసీసీఐకి క్లారిటీ: గంగూలీ

clarity on Dhoni's future: Ganguly, ధోనీ భవిష్యత్తుపై బీసీసీఐకి పూర్తి క్లారిటీ ఉంది: గంగూలీ

0
6

అంతర్జాతీయ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యంపై తమకు పూర్తి స్పష్టత ఉందని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఇలాంటి విషయాలు బహిరంగ వేదికపై చెప్పలేమని, భవిష్యత్తులో మీకు తెలుస్తుందని, బోర్డు, ధోనీ, సెలక్టర్ల మధ్య ఎంతో స్పష్టత ఉందని చెప్పారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో తన రిటైర్మెంట్ పైన ఎదురైన ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ.. తనను జనవరి వరకు ఏమీ అడగవద్దని చెప్పారు. దీంతో ధోనీ రిటైర్మెంట్ పైన ఊహాగానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గంగూలీ పైవిధంగా స్పందించారు.

ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 ఐపీఎల్‌లో ఇండియా వికెట్ కీపర్ – బ్యాట్స్‌మెన్ అయినా ధోనీ ఫామ్ చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఆడే దానిపై ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. దీనిపై కూడా గంగూలీ స్పందించారు. ఇంకా చాలా సమయం ఉందని, ఏమవుతుందో చూద్దామని తాజాగా అన్నారు.

ధోనీ చాంపియన్ అని, ఆటగాళ్లను ఎలా డీల్ చేయాలో అతనికి తెలుసునని, అద్భుతమైన ఆటగాడు అన్నారు. అతడి భవిష్యత్తు నిర్ణయాలు గోప్యంగా, పారదర్శకంగా ఉంటాయన్నారు. ధోనీ భారత్‌కు అద్భుతమైన ఆటగాడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here