జనతా కర్ఫ్యూ, రైళ్లు బంద్: బాలీవుడ్ గాయనికి కరోనా

0
13

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకు పరిమితమవ్వడమే కాకుండా.. ఆ రోజు (జనవరి 22) రైళ్లు నిలిచిపోనున్నాయి. ఏ ప్యాసింజర్ రైలు కూడా శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం రాత్రి 10 గంటల వరకు బయలుదేరబోదు. అప్పటికే బయలుదేరిన రైళ్లు మాత్రం గమ్యస్థానం చేరేవరకు అనుమతిస్తారు. ఢఇల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, సికింద్రాబాద్ సబర్బన్ రైలు సేవలు పరిమితంగా ఉంటాయి.

కరోనా వైరస్ సెగ పార్లమెంటుకు కూడా తాగింది. బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె ఇచ్చిన డిన్నర్‌లో పాల్గొన్న వసుంధరా రాజే, ఎంపీలు దుష్యంత్ సింగ్, డెరక్ ఓబ్రెయిన్‌లు సెల్ఫ్ ఐజోలేషన్‌కు వెళ్లారు. అప్నాదళ్ నేత అనుప్రియ పాటిల్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ పరీక్షల పేపర్ల మూల్యాంకన ప్రక్రియ నిలిపివేశారు. అత్యవసర కేసుల విచారణకు వర్చువల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. 23 నుండి వర్చువల్ కోర్టుల ద్వారా విచారణ చేపడతారు.

కావలిలో తల్లీ, తనయుడికి కరోనా లక్షణాలు గుర్తించారు. వారు జర్మనీ నుండి ఏపీకి వచ్చారు. వారిని కావలి ఆసుపత్రికి తరలించారు. చండీగఢ్‌లో శుక్రవారం నాలుగు కరోనా పాజిటివ్‌లు నమోదయ్యాయి. కేరళలో 12 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులను మూసివేసింది. నిత్యావసరణ రవాణా వాహనాలను మాత్రమే అనుమతిస్తోంది. భారత్‌ను కరోనా కేసులు 223కు చేరుకున్నాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here