కరోనాపై పోరాటానికి కీలక అడుగు, రంగంలోకి దిగిన సూపర్‌కంప్యూటర్

0
129

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకంలో కీలక అడుగుపడింది. వైరస్‌కు మందు కనిపెట్టేందుకు అంతర్జాతీయంగా వివిధ దేశాల శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ కరోనా మహమ్మారి శాస్త్రవేత్తలకు ఓ సవాల్‌గా మారింది. ఈ వ్యాది వేగంగా.. సులువుగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ దీని వ్యాప్తిని అడ్డుకోవడం. వ్యాప్తిని అడ్డుకుంటే ఆ తర్వాత మరణాలు, కేసులను తగ్గించవచ్చు.

అయితే వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించే కీలకమైన రసాయనాలను గుర్తించిందట. ఇది చాలా కీలకమైనదనే చెప్పవచ్చు. ఎందుకంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం చాలా కష్టతరంగా మారింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన ఐబీఎంకు చెందిన సూపర్ కంప్యూటర్… ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఓ ఔషధ సమ్మేళనం వర్క్ వుట్ అవుతుందనే కోణంలో విశ్లేషించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోగల 77 రకాల ఔషధ సమ్మేళనాలను ఈ సూపర్ కంప్యూటర్ గుర్తించింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి లేదా వైరస్‌ను రూపు మాపేందుకు ఇది కీలకమైన అడుగు అని చెప్పవచ్చు. ఈ సూపర్ కంప్యూటర్ పేరు సమ్మిట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలను సాల్వ్ చేసే ఉద్దేశ్యంతో దీనిని నిర్మించారు. మొత్తానికి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి, వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే వేగవంతమైన కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here