కరోనా: ఆ ఉద్యోగులకు కేంద్రం సెలవులు

0
5

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులు, డయాబెటీస్ కలిగిన ఉద్యోగులు, హార్ట్, కిడ్నీ సమస్యలు ఉన్న ఉద్యోగులకు ఏప్రిల్ 4వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. యాభై ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి సర్టిఫికేట్ లేకుండానే సెలవులు తీసుకోవచ్చు. ఈ మేరకు శుక్రవారం నాడు సంబంధిత మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. రెండున్నర లక్షలమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతో దేశాలు, రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వైరస్ సోకినట్లుగా అనుమానాలు వస్తే స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here