కరోనా వైరస్: ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు

0
1

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సాధ్యమైనంత మేర బయట తిరగవద్దని, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, కంపెనీలు కూడా ఆ దిశగా వెసులుబాటు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఈ నెల 22వ తేదీన ఆదివారం అందరూ ఉదయం 7 నుండి రాత్రి 9 వరకు కర్ఫ్యూ పాటించాలని ప్రజలను కోరారు. జనం కోసం జనం ద్వారా జనమే విధించుకునే కర్ఫ్యూ అన్నారు. ప్రపంచ యుద్ధాల కంటే ఇది పెద్దది అన్నారు. ప్రపంచ యుద్ధాల కంటే ఇది పెద్ద విపత్తు అన్నారు.

ఈ మహమ్మారి నుండి కాపాడేందుకు ఇప్పటి వరకు ఎలాంటి మార్గం లభించలేదన్నారు. ఇప్పటికిప్పుడు ఊరట కనిపించేలా లేదన్నారు. కాబట్టి వచ్చే కొద్ది వారాలు మీ అందరి సమయం ఇవ్వాలని, దృఢ సంకల్పంతో కలిసి పోరాడాలన్నారు. అనవసరంగా బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు పరస్పరం దూరం పాటించాలన్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇంటి నుండే చేసుకోవాలన్నారు. పదేళ్ల చిన్న పిల్లలు, 60-65 ఏళ్లు దాటిన వృద్ధులు బయటకు రావొద్దన్నారు.

22న జనతా కర్ఫ్యూ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పని చేయాలన్నారు. కరోనా తగ్గే వరకు అత్యవసర సర్జరీలు మినహా సాధారణ సర్జరీలు కూడా వాయిదా వేసుకోవాలన్నారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిపై ఒత్తిడి లేకుండా చూద్దామని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అంచనా వేయడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సరికాదని, పరిస్థితిని అర్థం చేసుకొని మానవత్వంతో వ్యవహరించాలన్నారు.

ఈ సందర్భంగా మోడీ పలు సూచనలు చేశారు. ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాలి. కచ్చితంగా అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దు. 10 ఏళ్ల లోపు, 0 ఏళ్లు పైబడిన వారు ఇళ్లలోనే ఉండాలి. మార్చి 22న జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి. సాధారణ తనిఖీల కోసం ఆసుపత్రులకు వెళ్లడం మానుకోవాలి. వాయిదా వేయగల శస్త్ర చికిత్సలు ఉంటే వాయిదా వేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ నష్టాన్ని అంచనా వేసేందుకు టాస్క్ ఫోర్స్. మీ ఇళ్లలో పని చేసే వారికి, సహాయ సిబ్బందికి, డ్రైవర్లకు, తోటమాలిలకు, ఇతరులకు వేతనాలు తగ్గించవద్దు. భయాందోళనతో హడావుడి కొనుగోళ్లు వద్దు. దేశంలో తగినంత ఆహారం, రేషన్ ఉంది. అబద్దపు ప్రచారాలకు లేదా రూమర్లకు దూరంగా ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here