మోడీ ప్రభుత్వం ఎఫెక్ట్: రూ.1 లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

0
30

ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా నవంబర్ 2019 జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్ల మార్క్‌ను దాటేశాయి. నవంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,03,492 కోట్లుగా ఉన్నాయి. ఇందులో సీజీఎస్టీ రూ.19,592 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.27,144 కోట్లు, ఐజీఎస్టీ కలెక్షన్లు రూ.49,028 కోట్లు ఉన్నాయి.

2018 నవంబర్ నెలలోని వసూళ్ల కంటే ప్రస్తుత నవంబర్ నెలలో వసూళ్లలో 6 శాతం పెరుగుదల ఉంది. 2019 అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్ నెలల్లో జీఎస్టీ వసూళ్లు వరుసగా రూ.95,380 కోట్లు, రూ.91,916 కోట్లు, రూ.98,202 కోట్లు. 2018 ఫిబ్రవరి తర్వాత సెప్టెంబర్ నెలలో కనిష్ట వసూళ్లు నమోదయ్యాయి.

వరుసగా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్.. మూడు నెలలు జీఎస్టీ కలెక్షన్లు రూ.1 లక్ష కోట్ల కంటే తక్కువగా నమోదయ్యాయి. 2017 జూలై నెలలో జీఎస్టీని తీసుకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు రూ.1 లక్ష కోట్ల వసూళ్లు జరిగాయి. ఇప్పుడు నవంబర్‌లోని కలెక్షన్లు థర్డ్ హయ్యెస్ట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here