మరింత దిగజారనున్న జీడీపీ: చిదంబరం జోస్యం 

0
11

భారత జీడీపీ వృద్ధి రేటు పై కాంగ్రెస్ సీనియర్  నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం జోస్యం చెప్పారు. మూడో త్రిమాషికంలో భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుతానికంటే కూడా అధ్వాన్నంగా ఉండబోతోందని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన రెండో త్రైమాశిక జీడీపీ గణాంకాలపై స్పందించిన అయన, ఇండియా జీడీపీ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. ఇదిలా ఉండగా… జులై – సెప్టెంబర్ (క్యూ 2) లో భారత జీడీపీ ఆరేళ్ళ కనిష్ట స్థాయి ఐన 4.5% కి పడిపోయింది. అయినప్పటికీ ప్రభుత్వం అంతా సవ్యంగానే ఉందని చెబుతోందని చిదంబరం దుయ్యబట్టారు. అన్ని రంగాలు కుదేలైన సందర్భంలో వచ్ఛే క్వార్టర్ లోనూ వృద్ధి రేటు స్వల్పంగానే  ఉంటుందన్నది ఆయన ప్రిడిక్షన్. ప్రస్తుతం జైలులో ఉన్న చిదంబరం తరపున ఆయన కుటుంబ సభ్యులు ఈ మేరకు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here