పెరిగిన రైల్వే ఛార్జీలు, సబర్బన్ రైళ్లకు ఊరట

0
4

రైల్వే ఛార్జీలను పెంచుతూ ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఛార్జీలను అతి స్వల్పంగా పెంచింది. సబర్బన్ రైళ్లలో మాత్రం ఛార్జీలు పెంచలేదు. పెరిగిన ధరల ప్రకారం… ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌కు కిలో మీటర్‌కు ఒక పైస చొప్పున పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మెయిల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్‌కు కిలో మీర్‌కు రూ.2 పైసల చొప్పున పెంచారు. ఏసీ చైర్ కార్, ఏసీ 3, 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు కిలో మీటరుకు 4 పైసల చొప్పున పెంచారు.

పెరిగిన ఈ ఛార్జీలు జనవరి 1, 2020 నుంచి అమలులోకి వస్తాయి. అంటే ఈ రోజు (డిసెంబర్ 31) అర్ధరాత్రి నుంచి ఇవి వర్తిస్తాయి. అయితే ఇప్పటికే ముందస్తు టిక్కెట్ తీసుకున్న వారు అదనంగా చెల్లించవలసిన అవసరం లేదు. వారికి అవే వర్తిస్తాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరేళ్ల తర్వాత మళ్లీ ఛార్జీలను అతి స్వల్పంగా పెంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here