జియో షాక్: ఛార్జీలు 40 శాతం పెంపు, కొత్తవారికి 300% బెనిఫిట్స్

0
7
jio
Jio hike

డిసెంబర్ నెల నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు టెలికం కంపెనీలు ప్రకటించాయి. ఆదివారం (డిసెంబర్ 1) ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియోలు ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. జియో తన టారిఫ్ ఛార్జీలను డిసెంబర్ 6వ తేదీ నుంచి పెంచుతున్నట్లు తెలిపింది. వాయిస్ కాల్స్, డేటా ఛార్జీలు 40 శాతం వరకు పెరుగుతాయని చెప్పింది.

అలాగే, రిలయన్స్ జియోకు వచ్చే కొత్త కస్టమర్లకు 300 శాతం అదనపు ప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే ఫెయిర్ యూసేజ్ పాలసీ-ఎఫ్‌యూపీ పరిమితిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటాతో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.

ఏజీఆర్‌కు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌పై భారీగా భారం పడింది. దీంతో టెలికం దిగ్గజాలైన భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలు ఛార్జీలు పెంచుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here