నారా లోకేష్ అరెస్ట్, 4 గంటల తర్వాత విడుదల

0
3

అమరావతి: ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్లి తిరిగొస్తుండగా.. కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాస్తారోకో వైపు వెళ్తున్నాడని.. అందుకే ఆయన్ను అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. పార్టీ ఆఫీసుకి వెళ్తున్నానని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని లోకేష్‌ అనుచరులు మండిపడుతున్నారు. లోకేష్‌తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

4  గంటల తర్వాత విడుదల

లోకేష్ ను పోలీసులు నాలుగు గంటల తర్వాత విడుదల చేసారు. అంతకుముందు టీడీపీ కార్యకర్తలు, రాజధాని ప్రాంత రైతులు లోకేష్ అరెస్టు ను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డగించారు. లోకేష్ ను విడుదల చేసిన అనంతరం వారు ఆందోళనలు విరమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here