తెలంగాణకు నిధులపై నిర్మల ఏమన్నారంటే

0
2

తెలంగాణ రాష్ట్రానికి నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం స్పందించారు. ఏ రాష్ట్రాన్ని తక్కువ ఎక్కువ చూడమని చెప్పారు.

‘నేను కూడా రాష్ట్ర నేతలు మాట్లాడిన వాటిని విన్నాను. ఈసారి 2 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి కాబట్టే 42 నుంచి ఒక శాతం తగ్గించి 41 శాతం నిధులు కేటాయించాము. అదనంగా ఒక శాతాన్ని యూటీ లకు కేటాయించాము. కేంద్రం నుంచి నిధులు ఏం తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం లేదు అనేది సరికాదు. ఏ ఒక్క స్టేట్ ను చిన్న చూపు చూడాలి అని మాకు లేదు. తెలంగాణ నుంచి కేంద్రానికి మంచి కాంట్రిబ్యూషన్ ఉంది’ అని నిర్మల అన్నారు.

‘సెస్ కలెక్షన్ తక్కువ కావడం వల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన gst నిధులు ఇవ్వలేకపోయము. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు.త్వరలోనే ఈ నిధులు ఇస్తాం. సెస్ వచ్చే కొద్దీ ఇస్తూనే ఉంటాం.తెలంగాణ కి 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న మాట అవాస్తవం’ అని కేం ఆర్ధిక మంత్రి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here