మోడీ జనతా కర్ఫ్యూలో పాల్గొందాం.. పవన్ కళ్యాణ్

0
17

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకి అందరం సంఘీభావం తెలుపుదామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిపై అందరం సమష్టిగా పోరాడాలన్నారు. అందరం ఇందులో పాల్గొందామన్నారు. మోడీ పిలుపును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేవలం జన సైనికులు మాత్రమే కాదని, మోడీ సూచనలను తెలుగు ప్రజలంతా పాటించాలని కోరారు.

కాగా, ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆ సమయంలో అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. 22న జనతా కర్ఫ్యూ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పని చేయాలన్నారు. కరోనా తగ్గే వరకు అత్యవసర సర్జరీలు మినహా సాధారణ సర్జరీలు కూడా వాయిదా వేసుకోవాలన్నారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిపై ఒత్తిడి లేకుండా చూద్దామని, ఇలాంటి పరిస్థితుల్లో వారి సహాయానికి గాను సాయంత్రం ఐదు గంటలకు బాల్కనీల్లోకి వచ్చి చప్పట్లతో అభినందిద్దామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here