శిశుమందిర్ పూర్వ విద్యార్థి సమ్మేళనం ప్రపంచ రికార్డ్

0
15
Poorva Vidyarthi Sammelanam

భాగ్యనగరం బండ్లగూడలోని శారదాపీఠంలో డిసెంబర్ 29, ఆదివారం రోజున శ్రీ సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అంచనా కంటే మరో మూడు నాలుగు వేల మంది విద్యార్థులు ఎక్కువగా వచ్చారు. దాదాపు 15,000 మందికి పైగా పూర్వ విద్యార్థులు, 2,000 మందికి పైగా ఆచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంచి మనసుతో చేసే ఏ పని అయినా దేశ సేవ కిందకే వస్తుందని, సేవ చేసేవాళ్లు నిస్వార్థంగా చేయాలని పిలుపునిచ్చారు. స్వలాభం కోసం కాకుండా దేశానికి సేవ చేసేందుకు కూడా పని చేయాలన్నారు. మంచి మనస్సుతో చేసే ఏ పని అయినా దేశ సేవ కిందకే వస్తుందన్నారు. మన విధులు మనం సరిగ్గా నిర్వహిస్తే అది కూడా దేశ సేవే అన్నారు. ఈ సందర్భంగా విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమంగా చొరబడి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఏరివేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే కొంతమంది అడ్డు పడుతున్నారన్నారు. వీటిని అడ్డుకోవాల్సి ఉందన్నారు. కాగా, ఓ విద్యాలయానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో పూర్వ విద్యార్థులు రావడం రికార్డుగా చెబుతున్నారు. తద్వారా ప్రపంచంలోనే ఎక్కువ మంది పూర్వ విద్యార్థులు హాజరైన సమ్మేళనంగా ఇది రికార్డు సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here