సైరా డైరెక్టర్ తో సాహో ?

0
12

సాహో తర్వాత హీరో ప్రభాస్ జాన్ అనే కొత్త సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే టాలీవుడ్ లో టాక్ వచ్చింది. దీని తర్వాత కూడా అయన వెంట వెంటనే రెండు మూడు సినిమాలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రభాస్… సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో కూడా ఒక సినిమా తీయాలని నిర్ణయించారట. ఈ మేరకు బాహుబలి హీరో తో ఇప్పటికే సురేందర్ రెడ్డి కొత్త సినిమా చర్చలు ప్రారంభించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సైరా సినిమా చూసిన ప్రభాస్ వెంటనే సురేందర్ రెడ్డి కి ఫోన్ చేసి ఆయన్ను అభినందించారట. ఆ తర్వాత సినిమా ప్రతిపాదన తో ముందుకు వచ్చారట. దీంతో సైరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సురేందర్ రెడ్డి వెంటనే ప్రభాస్ కు ఒకే చెప్పారని తెలిసింది. ఇటీవలే ప్రభాస్ ను కలిసిన సురేందర్ రెడ్డి ఆయనకు కథను కూడా వినిపించారట. ప్రభాస్ ప్రస్తుతం ప్రేమ కథ చిత్రాలనే ఎక్కువగా చేసే అవకాశాలు ఉండటంతో సురేందర్ రెడ్డి కూడా కామెడీ తో కూడిన మాంచి ప్రేమ కథను సిద్ధం చేశారట.

హీరోయిన్ … 

అయితే ఈ సినిమాను నిర్మించే నిర్మాత ఎవరు అయితే బాగుంటుందని ప్రస్తుతం ప్రభాస్, సురేందర్ రెడ్డి లు కొన్ని పేర్లను పరిశీలిస్తున్నారట. సాహో కు పెట్టిన డబ్బులు వెనక్కి రావటంతో … ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా కు సైతం  ఏ నిర్మాత అయినా ఒకే అంటరాని భావిస్తున్నారు. అయితే, ఈ సినిమా సాధారణ బడ్జెట్ లోనే రూపొందించాలని ఇరువురు అనుకొంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే దీనికి హీరోయిన్ ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే ఇద్దరు భామల పేర్లను అనుకొన్నపిటికీ … మరో ఇద్దరు ముగ్గురిని పరిశీలించిన తర్వాతే ముందుకు పోవాలని నిర్ణయించారట. ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కనుందో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here