ట్రంప్ ఆదేశాలతో అమెరికా రాకెట్ దాడి, ఇరాన్ కమాండర్ మృతి

0
1

ఇరాక్ రాజధాని బాగ్ధాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం ఉదయం రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్, ఇరాక్ దేశాలకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఇరాన్ నిఘా విభాగం ఖుద్స్ ఫోర్స్ అధినేత జనరల్ ఖాసీమ్ సోలెమన్ కూడా మృతి చెందాడు. కాగా, ఈ దాడి అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆదేశాలతో జరిగినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ధృవీకరించింది.

ఇరాక్‌లోని అమెరికా బలగాలను రక్షించుకునేందుకు ట్రంప్ స్వయంగా ఖాసీమ్‌ను చంపాలని ఆదేశించారని తెలిపింది. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్‌లో కీలక నిఘా విభాగం ఖుద్స్ ఫోర్స్‌కు మేజర్ జనరల్ ఖాసీమ్ సోలెమన్ 1998 నుంచి అధినేతగా ఉన్నాడు. సరిహద్దు వెలుపల జరిగే దాడులు ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. బషర్ అల్ అసద్ ప్రభుత్వ కూల్చివేత, ఇరాక్‌లో ఇస్లామిస్ స్టేట్ పైన పోరులో ఖాసీం కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమనెయ్‌కు ఖాసీం నేరుగా రిపోర్ట్ చేస్తారు. నాలుగు దశాబ్దాల క్రితం (1980)లో ఇరాన్ – ఇరాక్ యుద్ధ సమయంలో ఖాసీం తొలిసారి వెలుగులోకి వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here