3వ ప్రపంచ యుద్ధానికి సంకేతమా? అమెరికాకు ఇరాన్ రెడ్ ఫ్లాగ్

0
5

బాగ్ధాద్ విమానాశ్రయంపై అమెరికా రాకెట్ లాంచ్ దాడిలో ఇరాన్ కీలక కమాండర్ ఖాసీమ్ సోలేమని హతమయ్యారు. దీంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అమెరికా లక్ష్యంగా బాగ్దాద్‌లోని ఆ దేశ వైమానిక స్థావరం, రాయబార కార్యాలయంపైకి రాకెట్లు, మోర్టార్లు కూడా దూసుకు వచ్చాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరాక్ రాజధాని బాగ్ధాద్ దద్దరిల్లిపోయింది.

అమెరికా బలగాలు మోహరించిన ఆల్ బలాద్ వైమానిక స్థావరం వైపు శనివారం సాయంత్రం రెండు రాకెట్లు దూసుకొచ్చాయి. బాగ్దాద్ అమెరికా రాయబార కార్యాలయం ఉన్న గ్రీన్ జోన్ ప్రాంతం వద్ద రెండు మోర్టార్లు పడ్డాయి. ఈ చర్య ద్వారా అమెరికాపై ప్రతీకారం తప్పదని ఇరాన్ మరోసారి వెల్లడించినట్లయింది. బాగ్దాద్‌కు సమీపంలోని తాజి పట్టణంలో ఇరాన్ అనుకూల ఇరాక్ ముఠా షాహీద్ ఆల్ షాబీకి చెందిన మెడికల్ కాన్వాయ్ లక్ష్యంగా కూడా దాడి జరిగింది.

దాడి, ప్రతిదాడులు కొనసాగుతుండగానే ఇరాన్.. అమెరికాతో యుద్ధానికి సై అని సంకేతాలు ఇచ్చింది. టాప్ కమాండర్ సోలేమని హతమైన నేపథ్యంలో ఇరాన్ ఎర్రజెండాను ఎగురవేసింది. ఇలా ఎగురవేయడం అంటే వారి పురాణ సంప్రదాయం ప్రకారం రాబోవు తీవ్ర యుద్ధానికి ప్రతీక. కాగా, ట్విట్టర్‌లో వరల్డ్ వార్ త్రీ, రెడ్ ఫ్లాగ్ ట్రెండ్ అయ్యాయి. రెడ్ ఫ్లాగ్‌ను ఎగురవేయడం అంటే రాబోవు తీవ్ర యుద్ధానికి సంకేతంగా చెబుతున్నారు.

Redflag a symbol of war is unfurled for the first time in history over the holy dome of the biggest & importanti mosques in the Qom in Iran.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here