ఓరుగల్లుకు మరో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ

0
7
  1. కాక‌తీయుల రాజ‌ధాని, నేటి తెలంగాణ రెండో రాజ‌ధాని ఓరుగ‌ల్లు పారిశ్రామిక అభివృద్ధికి సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌ఫ‌లం అవుతున్నాయని శాస‌న మండ‌లి స‌భ్యులు పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.  సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల విజ్ఞ‌ప్తుల మేర‌కు, వ‌రంగ‌ల్ ని ఐటీ రంగంలో అగ్ర‌గామిగా తీర్చిదిద్దే య‌జ్ఞంలో ఒక్కో కంపెనీ భాగ‌స్వామ్యం అవుతున్నాయన్నారు. వ‌రంగ‌ల్ స‌మీపంలోని మడికొండలో గ‌ల ఐటీపార్కులో ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన టెక్‌ మహీంద్రా, సైయెంట్‌ తమ బ్రాంచీలను ఏర్పాటు చేశాయని, సీఎం కేసీఆర్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ కూడా వరంగల్‌లో తన కార్యకలాపాలను సాగించేందుకు ముందుకొచ్చిందని చెప్పారు. తాజాగా, క్వాడ్రంట్‌ రిసోర్స్‌ సెంటర్ 1.5 ఎకరాల్లో ఏర్పాటు కానున్న‌దని, ఈ ఐటీ సెంటర్‌ ద్వారా స్థానికంగా 500 మందికి ఉపాధి లభించనుంది అని ఆయన చెప్పారు. ఇందుకు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల‌కు క్వాడ్రంట్‌ వ్యవస్థాపకుడు, సీఈవో వంశీరెడ్డికి ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు, ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 16న వరంగల్‌లో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్ కు ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, న‌గ‌రాభివృద్ధిశాఖ‌ల మంత్రి కెటిఆర్, మ‌రో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు శంకుస్థాపన చేయబోతున్నందుకు అనందంగా ఉంద‌న్నారు.

తెలంగాణ‌లో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సిఎం కెసిఆర్,  ఐటీ మంత్రి కెటిఆర్ లు తీసుకుంటున్న చొర‌వ‌ వ‌ల్లే వరంగల్‌ జిల్లాకు ప్రముఖ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని, ఐటీ కంపెనీల రాకతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉన్నదని ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here