సుందర్ పిచాయ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

0
53
sundar pichai
Pic from Twitter

సుందర్ పిచాయ్. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇదే పేరు మరో సారి మారుమోగుతోంది. ఎందుకంటే… భారతీయుడు ఐన సుందర్ పిచాయ్ ఇప్పటికే ప్రపంచ అగ్రగామి సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ కు సీఈఓ గా పనిచేస్తున్నారు. కానీ తాజాగా అయన గూగుల్ మాతృ సంస్థ ఐన ఆల్ఫాబెట్ కు కూడా సీఈఓ గా నియమితులయ్యారు. పైగా గూగుల్ వ్యవస్థపుకు ఐన లారి పేజ్, సెర్గీ బ్రిన్ పూర్తిగా ఆల్ఫాబెట్ నుంచి తప్పుకొని మరీ మన వాడికి పూర్తి రథసారథ్యం అప్పగించారు. దీంతో సుందర్ పిచాయ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల, శక్తివంతమైన సీఈఓ ల్లో ఒకరిగా ఆవిర్భవించారు.  ఈ నేపథ్యంలో సుందర్ పిచాయ్ గురించిన కొన్ని ఆసక్తి కరమైన విషయాలు మీకోసం…

 

చెన్నై కుర్రాడు…

 

తమిళ నాడు లోని చెన్నై కి చెందిన సుందర్ పిచాయ్ … 10 జూన్ 1972 లో జన్మించారు. ఆయన తండ్రి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాగా… తల్లి స్టెనోగ్రాఫేర్. ఐఐటీ ఖరాగపూర్ లో బీటెక్ చదివారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, వార్తాన్ స్కూల్ అఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.

 

2004 లో గూగుల్ లో చేరిక…

 

గూగుల్ లో చేరాక ముందు సుందర్ పిచాయ్ .. అప్లయిడ్ మెటీరియల్స్, మాక్ కిన్సే కంపెనీల్లో పనిచేసారు. 2004 లో అయన వైస్ ప్రెసిడెంట్ – ప్రోడక్ట్ డెవలప్మెంట్ గా చేరాడు. ఆ సమయంలోనే సుందర్ క్రోమ్ బ్రౌసర్, ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధి చేస్తున్న బృందానికి నాయకత్వం వహించారు.

 

జీ మెయిల్ పుట్టిన రోజు…

 

జీ మెయిల్ పుట్టిన రోజు ఐన 2004 ఏప్రిల్ 1 న (అల్ ఫూల్స్ డే కూడా) సుందర్ పిచాయ్ ని ఇంటర్వ్యూ చేసారు. ఆ సమయం లో జీ మెయిల్ పై అయన  ఆడో వృధా ప్రయాస అని సమాధానమిచ్చారు. 2008 లో అయన క్రోమ్ బ్రౌసర్ లాంచ్ కు సారథ్యం వహించారు. అలాగే నోటుబుక్స్, డెస్క్ టాప్ లకు క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం అందించారు. 2012 లో గూగుల్ ఆప్స్, 2013 లో ఆండ్రాయిడ్ డివిజన్ లకు హెడ్ గా బాధ్యతలు చేపట్టారు.

 

ట్విట్టర్ కు నో…

 

సుందర్ పిచాయ్ సమర్థను గుర్తించిన ట్విట్టర్ ఆయనకు సీఈఓ పదవిని ఆఫర్ చేసింది. కానీ సుందర్ దానిని సున్నితంగా తిరస్కరించారు. 2013 లో మైక్రోసాఫ్ట్ సీఈఓ రేసులో కూడా సుందర్ పేరు వినిపించింది. కానీ మైక్రోసాఫ్ట్ కు మన తెలుగు వాడైన సత్య నాదెళ్ల సీఈఓ గా నియమితులయ్యారు.

 

త్వరలోనే బిలియనీర్ …

 

సుందర్ పిచాయ్ కి సాలీనా సుమారు 20 కోట్ల డాలర్ల శాలరీ లభిస్తుంది. మన కరెన్సీ లో అది సుమారు రూ 1,400 కోట్లు. రెండేళ్ల క్రితమే అయన సంపద 60 కోట్ల డొల్లర్లుగా ఉంది. అంటే సుమారు రూ 4,200 కోట్లు. సో, ఇప్పటికే అయన బిలియనీర్ ఐ ఉండొచ్చు. లేదా త్వరలోనే బిల్లియనీర్ కావొచ్చు. 100 కోట్ల డాలర్ల సంపద ఉంటె బిలియనీర్ గా పరిగణిస్తారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here