రోజువారీ కూలీలకు రూ.1,000, పేదలకు ఉచిత ధాన్యం: యోగి ఆదిత్యనాథ్

0
41

కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో రోజువారీ కూలీలు ఎక్కువగా నష్టపోతున్నారు. దీంతో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లు, షాపింగ్ మాల్స్, జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలను మూసివేస్తుండటంతో రోజుకూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

ఉపాధి కోల్పోయే రోజువారీ శ్రామికులకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. యూపీలోని డెయిలీ లేబర్, భవన నిర్మాణ కార్మికులకు రోజుకు రూ.వెయ్యి ఇస్తామని యోగి తెలిపారు. దీని వల్ల దాదాపు 15 లక్షల మంది రోజువారీ కార్మికులకు, 20.37 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తారు.

1.65 లక్షల కుటుంబాలకు ఒక నెల ధాన్యం ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఎంఎన్ఆర్ఈజీఏ కార్మికులకు వెంటనే వేతనాలు ఇస్తామన్నారు. పెన్షనర్లకు ఏప్రిల్ నెలలో ఒకేసారి రెండు నెల పెన్షన్ ఇస్తామన్నారు. బీపీఎల్ కుటుంబాలకు 20 కిలోల గోధుమలు, 15 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామన్నారు. కేరళ ప్రభుత్వం కూడా కార్మికులకు ఇలాంటి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here